: నా కూతురికి ఎంత ఆనందమో: మహేష్ బాబు షేర్ చేసిన వీడియో


ఇటీవల సోషల్ మీడియా వేదికగా విడుదలైన మహేష్ బాబు కొత్త చిత్రం 'స్పైడర్'లోని 'బూమ్ బూమ్' పాట ఓ వైపు క్యాచీగా ఉండి వైరల్ అవుతున్న వేళ, ఆయన కుమార్తె సితారకు కూడా తెగ నచ్చేసింది. ఇక ఇంటా, బయటా సితార ఇదే పాటను రిపీట్ మోడ్ లో పెట్టుకుని తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఈ పాట సితారకు కొత్త ఫేవరెట్ సాంగ్ అయిపోయిందని అన్నాడు. కారులో వెళుతూ 'బూమ్ బూమ్' పాటను వింటూ ఆనందిస్తున్న సితార వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తన 'చిట్టి స్పైడర్' కారులో ఈ పాటను వింటోందని ఆనందంగా చెప్పాడు. కాగా, ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ భాషల్లో వచ్చే నెల 27న వెండితెరలను తాకనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News