: పుజారాని ఆకాశానికి ఎత్తేసిన కోహ్లీ!


శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న పుజారాపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచంలో ఉన్న గొప్ప టెస్ట్ బ్యాట్స్ మెన్ లలో పుజారా ఒకడని కోహ్లీ కితాబిచ్చాడు. అతని మానసిక సామర్థ్యం, పరుగుల దాహమే అతన్ని గొప్ప బ్యాట్స్ మెన్ గా నిలబెట్టాయని చెప్పాడు. జట్టు మిడిల్ ఆర్డర్ లో పుజారా, రహానే రూపంలో ఇద్దరు కీలక బ్యాట్స్ మెన్లు ఉన్నారని... అయితే, తాను పుజారాకే ఎక్కువ క్రెడిట్ ఇస్తానని తెలిపాడు. జట్టు తరపున కేవలం ఒకే ఒక ఫార్మాట్ (టెస్ట్)లోనే ఆడుతున్నప్పటికీ... పరుగుల దాహంతో ప్రతిసారి అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడాడు. ఎంతో అకుంఠిత దీక్ష ఉంటేనే ఇది సాధ్యపడుతుందని చెప్పాడు. ప్రతిసారీ నిలకడగా రాణించడం సాధారణ విషయం కాదని అన్నాడు. 

  • Loading...

More Telugu News