: ఉత్తర కొరియాకు కీలక సూచన చేసిన చైనా!


తన మిత్ర దేశం ఉత్తర కొరియాకు చైనా కీలక సూచన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని... క్షిపణి పరీక్షలు, న్యూక్లియర్ టెస్టులను ఆపేయాలని సూచించింది. సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల భేటీలో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హోతో భేటీ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ మేరకు సలహా ఇచ్చారు.

తద్వారా, క్షిపణి పరీక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాపై ఐక్యరాజ్య సమితి భద్రతామండలి విధించిన ఆంక్షలకు సంబంధించి చర్చలు జరపడానికి అవకాశం ఉంటుందని సూచించారు. రానున్న రోజుల్లో క్షిపణి పరీక్షలను నిర్వహించడం ద్వారా ఐక్యరాజ్యసమితి నిర్ణయాలను ధిక్కరించడం చేయరాదని వాంగ్ తెలిపారు. ఉద్రిక్తతలు పెరగకుండా వ్యవహరించాలని అమెరికా, ఉత్తర కొరియాలకు విన్నవిస్తున్నామని చెప్పారు.  

  • Loading...

More Telugu News