: అహ్మదాబాద్ లో దిగగానే మరో రిసార్టుకు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు


రాజ్యసభ ఎన్నికల్లో గెలుపుకోసం అడ్డదారులు తొక్కుతూ, తమ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టి వారిని లోబరచుకునే ప్రయత్నాలను బీజేపీ చేస్తున్నదని ఆరోపిస్తూ, 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దాదాపు రెండు వారాల పాటు కర్ణాటకలో దాచిన కాంగ్రెస్, ఇప్పుడు వారిని మరో రిసార్టుకు తీసుకెళ్లింది. రేపు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు అందరు ఎమ్మెల్యేలనూ అహ్మదాబాద్ చేర్చిన కాంగ్రెస్, వారిని 77 కిలోమీటర్ల దూరంలోని నీర్జానంద్ రిసార్టుకు తీసుకెళ్లింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ మాట్లాడుతూ, విజయంపై తమకు నమ్మకం ఉందని, ఎమ్మెల్యేలంతా తమవైపే ఉన్నారని అన్నారు. ఈ ఉదయం 9 గంటల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుసుకున్న ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు భరత్ సిన్హ్ సోలంకీ కలుసుకుని రాజ్యసభ ఎన్నికలపై చర్చించారు. కాగా, గత నెలలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడటంతో, మిగిలిన వారిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News