: మోదీ భద్రత కోసం విదేశీ జాగిలాలు


ప్రధాని నరేంద్ర మోదీ  భద్రతకు అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పేరున్న స్నిఫర్ డాగ్స్ ను ఇజ్రాయిల్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఇజ్రాయిల్ రక్షణ రంగంలో కీలకంగా నిలిచిన కానైన్లు, లాబ్రడార్లు, జర్మన్ షెప్పర్లు, బెల్జియన్ మాలిటియోస్ జాతులను దిగుమతి చేసుకున్నట్టు సీనియర్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.

ప్రధాని మోదీకి ముప్పు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ శునకాలకు సుమారు 6 నెలల పాటు శిక్షణ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. శిక్షణ కాలంలో ఈ డాగ్స్ కు ప్రత్యేకమైన ఆహారం, నివాస వాతావరణం ఏర్పాటు చేశారు. ఈత నేర్పించే నిమిత్తం వాటికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందట. భారత మాజీ ప్రధానుల కుటుంబాలకు సైతం ఈ భద్రత వర్తిస్తుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News