: మూడో టెస్ట్ కు జడేజా దూరం.. ప్రవర్తన సరిగా లేదంటూ ఐసీసీ వేటు!
శ్రీలంకతో నామమాత్రంగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ కు ఆల్ రౌండర్ జడేజా దూరం కానున్నాడు. జడేజా ప్రవర్తన సరిగా లేదంటూ ఐసీసీ అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ కారణంగా రెండో టెస్ట్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడమే కాకుండా, మూడో మ్యాచ్ ఆడేందుకు వీలు లేదంటూ జడేజాను ఐసీసీ ఆదేశించింది.
కాగా, రెండో టెస్టులో ఓపెనర్ దిముత్ కరుణరత్నె క్రీజులో ఉన్నప్పుడు జడేజా అనవసరంగా అతడిపైకి బంతి విసిరాడు. ఫీల్డ్ అంపైర్లు ఈ చర్యను ప్రమాదకరమని హెచ్చరించిన నేపథ్యంలో జడేజాపై వేటు పడింది. ఐసీసీ క్రికెటర్ల నియమావళి ప్రకారం జడేజా 24 నెలల కాలంలో ఆరు డీమెరిట్ పాయింట్లకు చేరుకున్నాడు. జడేజా స్థానంలో కల్ దీప్ యాదవ్ కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.