: సిట్ కు గౌతం సవాంగ్ పర్యవేక్షణ వద్దు: నన్నపనేని రాజకుమారి


ఆయేషా మీరా హత్య కేసులో పునర్విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పర్యవేక్షణ బాధ్యతలను విజయవాడ సీపీ గౌతం సవాంగ్ కు అప్పగించవద్దని ఏపీ మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కోరారు. సిట్ పర్యవేక్షణకు మహిళా అధికారిని నియమించాలని ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని అన్నారు. ఈ కేసులో సత్యంబాబు బలైపోయాడని, అతని జీవితాన్ని నాశనం చేశారని ఆమె అన్నారు.

కాగా, రాజకీయాల గురించి ఆమె మాట్లాడుతూ, మంత్రి అఖిలప్రియ డ్రెస్ కోడ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. డ్రెస్ కోడ్ పై విమర్శలు చేయడం సబబుకాదని రోజాకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News