: టీడీపీని ప్రజలు తప్పక గెలిపిస్తారు: భూమా బ్రహ్మానందరెడ్డి భార్య ప్రతిభ


టీడీపీని ప్రజలు తప్పక గెలిపిస్తారని భూమా బ్రహ్మానందరెడ్డి భార్య ప్రతిభ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ తరపున బరిలోకి దిగిన తన భర్త బ్రహ్మానందరెడ్డి తరపున ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నానని చెప్పారు. రోడ్లు, శానిటేషన్ మొదలైన సమస్యలను ప్రజలు తన దృష్టికి తెస్తున్నారని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. ఇందుకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయని, ఉపఎన్నిక తర్వాత పనులు మొదలుపెడతామని చెప్పారు. ప్రజలు తమను చక్కగా స్వాగతిస్తున్నారని, గెలుపుపై ధీమాతో ఉన్నామని, మంచి మెజార్టీతో విజయం సాధిస్తామని ప్రతిభ ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News