: కొలంబో టెస్ట్ లో భారత్ ఘనవిజయం!


కొలంబో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 439 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక జట్టు 386కు ఆలౌటైంది. దీంతో, మరో మ్యాచ్ మిగిలి ఉండగా టెస్ట్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో 2-0 తేడాతో టీమిండియా ఘన విజయం సాధించడంలో స్పిన్నర్ల పాత్ర కీలకం. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్, సెకండ్ ఇన్నింగ్స్ లో జడేజా వీరవిహారం చేశారు. రెండో ఇన్నింగ్స్ లో జడేజాకు 5 వికెట్లు, అశ్విన్, పాండ్యాకు చెరో రెండు వికెట్లు పడ్డాయి. 

  • Loading...

More Telugu News