: మోదీకి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టడానికి చంద్రబాబు, జగన్ లు పోటీపడుతున్నారు: రఘువీరా
సొంత ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లు సాగిలపడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. మోదీకి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టేందుకు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు బద్ధ వ్యతిరేకి అయిన మోదీకి సలాం కొడుతున్నారని అన్నారు. వీరిద్దరూ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని చెప్పారు.
నంద్యాల ఉప ఎన్నికలో రఘువీరారెడ్డి ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, జగన్ లపై విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయలను టీడీపీ, వైసీపీలు ఖర్చు చేస్తున్నాయని మండిపడ్డారు. తాము కేవలం మంచి తనాన్నే నమ్ముకుని ముందుకు సాగుతున్నామని చెప్పారు.