: రాహుల్ కారుపై దాడి ఘటనలో ఓ వ్యక్తి అరెస్ట్!


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారుపై దాడి చేసిన ఘటనలో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వ్యక్తి జయేష్ దర్బీగా తెలుస్తోంది. ఆయన బీజేపీ యువజన విభాగానికి చెందిన నాయకుడు. దాడి నేపథ్యంలో, కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. గుజరాత్ లోని వరద బాధిత ప్రాంతాల్లో శనివారం నాడు రాహుల్ గాంధీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాహుల్ కారుపై రాళ్లు రువ్వారు. అయితే, ముందు సీట్లో కూర్చున్న రాహుల్ కు ఎలాంటి గాయం కాలేదు. 

  • Loading...

More Telugu News