: మిస్సయిన సీట్ బెల్ట్ నంబర్లు.. చికాగోలో ఎయిరిండియా విమానాన్ని ఆపేసిన అమెరికా అధికారులు!
సీటు బెల్టులపై ట్యాగ్ నంబరు మిస్సయ్యాయన్న కారణంతో చికాగో నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిరిండియా విమానాన్ని అమెరికా అధికారులు ఎగరకుండా అడ్డుకున్నారు. ఢిల్లీ బౌండ్ బోయింగ్-777లో పలు సీట్ల బెల్టులపై నంబర్లు లేకపోవడాన్ని గుర్తించిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారులు విమానాన్ని 8 గంటలపాటు నిలిపివేశారు.
చికాగో నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో డెల్టా ప్లైట్‌లో కొన్ని సీటు బెల్టులు పాడవడంతో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో పార్క్ చేసి ఉన్న ఎయిరిండియా విమానంలో కొన్ని సీటు బెల్టులను తెప్పించి వాటిని డెల్టా ఫ్లైట్‌లో అమర్చారు. అనంతరం విమానం ఢిల్లీకి టేకాఫ్ అయేందుకు సిద్ధమవుతుండగా 44 మంది ప్రయాణికుల సీట్లు, 12 మంది విమాన సిబ్బంది సీట్లపై ట్యాగ్ నంబరు మిస్సయినట్టు గమనించిన అమెరికా అధికారులు విమానాన్ని దాదాపు ఎనిమిది గంటల పాటు నిలిపివేశారు.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎఫ్ఏఏ తీరుపై ఎయిరిండియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త సీటు బెల్టులు లేకపోవడం వల్లే వేరే విమానంలోని బెల్టులు వాడాల్సి వచ్చిందని, కొత్తవాటికి ఆర్డర్ చేశామని, త్వరలోనే వాటిని మారుస్తామని ఎయిరిండియా అధికారులు తెలిపారు.