: రోజూ డ్రగ్స్ వాడుతా.. ఇది మాకు కామన్!: కమింగో
డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు, నెదర్లాండ్స్ కు చెందిన మైక్ కమింగోను శేరిలింగంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో నిన్న విచారించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. డ్రగ్స్ వాడటం తమ దేశంలో సర్వసాధారణమైన విషయమని... ఇక్కడి చట్టాలపై తనకు అవగాహన లేదని చెప్పాడు. తాను ప్రతి రోజు డ్రగ్స్ వాడుతానని... అయితే, ఇతరులెవరికీ డ్రగ్స్ ఇవ్వనని తెలిపాడు. తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని పేర్కొన్నాడు. తన ఫోన్ లాక్ కోడ్ ను మరిచిపోయానని చెప్పాడు.
కమింగో శేరిలింగంపల్లి పరిధిలోని నానక్ రాంగూడలో ఉన్న ఆరెంజ్ కౌంటీలో ఉంటున్నాడు. డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న సినీ ప్రముఖులు ఆయన ఫ్లాట్ పక్కనే ఉంటున్నారు. 2.6 గ్రాములు డీఎంటీ డ్రగ్స్ కేసులో కమింగోను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.