: జీఎస్టీ పాలక మండలి నిర్ణయంపై సీఎం కేసీఆర్ అసంతృప్తి!
ఢిల్లీలో ఈ రోజు జరిగిన జీఎస్టీ పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై 12 శాతం జీఎస్టీ విధించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై పన్ను వల్ల తెలంగాణలో పాటు అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి రేపు ఓ లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం, మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో రూ.2.30 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై 18 శాతం పన్ను వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని చెప్పారు. ఈ పన్నును 12 శాతానికి తగ్గించడానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారని అన్నారు. సెప్టెంబర్ 9న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని కోరగా, జైట్లీ అంగీకరించారని చెప్పారు.