: కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ అని ‘నక్షత్రం’ హీరోయిన్ కి తెలియదట!
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన ‘నక్షత్రం’ చిత్రం నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఓ పాత్ర పోషించింది. అయితే, ఈ చిత్రం పనిలో భాగంగా దర్శకుడు కృష్ణవంశీ ఆఫీసుకు గతంలో ఓసారి ప్రగ్యా వెళ్లారట. అక్కడ గోడపై ‘బాహుబలి’లో రమ్యకృష్ణ పోస్టర్ అతికించి ఉందట. ఈ పోస్టర్ ను చూసిన ప్రగ్యా, రమ్యకృష్ణకు కృష్ణవంశీ వీరాభిమాని అనుకుందట. ఆ తర్వాత కృష్ణవంశీకి రమ్య భార్య అన్న విషయం తెలిసి, నవ్వుకున్నానని ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా చెప్పుకొచ్చింది.