: `అర్జున్ రెడ్డి` ట్రైలర్ విడుదల
టీజర్‌తో అందరిలోనూ భారీ అంచనాలను రేకెత్తించిన `అర్జున్ రెడ్డి` సినిమా ట్రైలర్ విడుదలైంది. `పెళ్లి చూపులు` తర్వాత హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ద్వారా విజయ్‌లోని కొత్త కోణాన్ని దర్శకుడు సందీప్ వంగ ఆవిష్కరించినట్లుగా కనిపిస్తోంది. కోపాన్ని నియంత్రించుకోలేని ఓ మెడికల్ స్టూడెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ సరసన షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కమల్ కామరాజ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి రాధన్ స్వరాలు సమకూర్చారు. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదలకానుంది.