: వెంకయ్యనాయుడుకి స్వీట్ తినిపించిన సతీమణి!.. స్వగ్రామంలో సంబరాలు!


భారత ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు విజయం సాధించడంతో ఆయన కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఈ వార్త తెలియగానే, వెంకయ్యనాయుడుకి ఆయన సతీమణి ఉష స్వీటు తినిపించి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం, ఆయన పాదాలకు ఆమె నమస్కరించారు. వెంకయ్యనాయుడు కూడా తన భార్యకు స్వీటు తినిపించారు. కాగా, నెల్లూరు జిల్లాలోని వెంకయ్యనాయుడి స్వస్థలం చవటపాలెంలో సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. తమ గ్రామానికి చెందిన వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి అవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందంటూ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News