: వెంకయ్యనాయుడుకి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ!
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఎం. వెంకయ్యనాయుడుకి ప్రధానినరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ వరుస ట్వీట్లు చేశారు. ‘భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన వెంకయ్యనాయుడు గారికి శుభాకాంక్షలు. మీ పదవీ కాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
‘ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా వెంకయ్యనాయుడుగారితో కలిసి పని చేసిన జ్ఞాపకాలు నా మదిలో నిండిపోయాయి.. భారత ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు దేశ సేవకు, జాతి నిర్మాణానికి అంకిత భావంతో పని చేస్తారనే విశ్వాసం నాకు ఉంది’ అని మోదీ అభిప్రాయపడ్డారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన వెంకయ్యనాయుడుకి పలువురు ఎంపీలు, మంత్రులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు.