: యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన పాట... డెస్పాసిటో!
స్పానిష్ భాషలో చిత్రీకరించిన `డెస్పాసిటో` పాట అప్‌లోడ్ అయిన కొద్దిరోజుల్లోనే యూట్యూబ్ రికార్డులను తిరగరాసింది. 300 కోట్ల వీక్షణలతో యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసిన వీడియోగా నిలిచింది. `గంగ్నమ్ స్టైల్` రికార్డును దాటేసిన `విజ్ ఖలీఫా - సీ యూ అగైన్` పాట రికార్డును `డెస్పాసిటో` పాట కొన్ని రోజుల్లోనే అధిగమించింది. జనవరి 12, 2017న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు ఏడు నెలల కాలంలోనే 300 కోట్ల వీక్షణలు వచ్చాయి. యూట్యూబ్, సోషల్ మీడియా సహా అన్ని రకాల ప్లాట్‌ఫాంలు కలుపుకుని 460 కోట్ల వీక్షణలు సాధించిన మొదటి వీడియోగా `డెస్పాసిటో` రికార్డుకెక్కింది. ప్యూర్టోరికో సింగర్ లూయీస్ ఫొన్సీ పాడిన ఈ పాట వీడియోలో డాడీ యాంకీ నర్తించారు.