: `వాన్నాక్రై` కిల్‌స్విచ్ హ్యాక‌ర్ బెయిల్‌పై విడుద‌ల‌... 40 ఏళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం!


బ్యాంకింగ్ మాల్‌వేర్‌ని త‌యారు చేసి, అమ్మ‌కాలు చేప‌ట్టిన కార‌ణంగా లాస్ ఏంజెలీస్‌లో అరెస్టైన `వాన్నాక్రై` కిల్‌స్విచ్ హ్యాక‌ర్ మార్క‌స్ హాచిన్స్ ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. 30,000 డాల‌ర్లు చెల్లించి‌, దేశం వ‌దిలి వెళ్లకూడదన్న షరతులపై మార్క‌స్‌కు బెయిల్ మంజూరు చేశారు. ఆగ‌స్టు 8న అత‌ని కేసు విచార‌ణ మొద‌ల‌వుతుంది. ఒక‌వేళ మార్క‌స్‌పై ఆరోప‌ణ‌లు రుజువైతే అమెరికా న్యాయ‌చ‌ట్టాల ప్ర‌కారం అత‌నికి గ‌రిష్టంగా 40 ఏళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది.

 అయితే, అత‌నిపై ఆరోప‌ణ‌ల్లో పెద్ద‌గా బ‌లం లేక‌పోవ‌డంతో స‌రైన డిఫెన్స్ ఉంటే శిక్ష‌ను త‌గ్గించే అవ‌కాశాలున్నాయ‌ని ఎల‌క్ట్రానిక్ ఫ్రంటియ‌ర్ ఫౌండేష‌న్ అనే స్వ‌చ్ఛంద సంస్థ చెబుతోంది. అంతేకాకుండా త‌మ స్వ‌చ్ఛంద సంస్థ త‌ర‌ఫున మంచి డిఫెన్స్ లాయ‌ర్ ను కూడా మార్క‌స్ కోసం అందుబాటులో ఉంచుతామ‌ని వారు పేర్కొన్నారు. ప్ర‌పంచ దేశాల‌ను `వాన్నాక్రై` వంటి ప్ర‌మాద‌క‌ర‌ ర్యాన్స‌మ్‌వేర్ నుంచి కాపాడిన హీరోను ఇలా ట్రీట్ చేయ‌డం స‌బబుగా లేద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.

  • Loading...

More Telugu News