: అభిమాన వర్షంలో తడిసిముద్దయ్యానంటున్న రకుల్ ప్రీత్ సింగ్!


టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అభిమాన వర్షంలో తడిసి ముద్దయ్యానంటోంది. క్రేజీ ప్రాజెక్టులతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో నెంబర్ వన్ రేసుకోసం పోటీ పడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ రోజు కర్నూలులో సందడి చేసింది. బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న రకుల్.. కర్నూలులో ఆ సంస్థ ఏర్పాటు చేసిన అవుట్ లెట్ ఓపెనింగ్ కు వెళ్లింది. బిగ్ సి షాప్ ఓపెనింగ్ కు రకుల్ వస్తుందన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆ షోరూంకు పోటెత్తారు. వారందర్నీ చూసిన రకుల్ షాప్ ఓపెనింగ్ సందర్భంగా సెల్ఫీ దిగి తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. ఈ సందర్భంగా కర్నూలు వాసుల అభిమాన వర్షంలో తడిసి ముద్దయ్యానని, 4,151వ షోరూం ఓపెన్ చేసిన బిగ్ సి కి శుభాకాంక్షలని తెలిపింది. తనకు ఇంత మంచి అనుభూతిని మిగిల్చినందుకు ధన్యవాదాలు చెప్పింది. 

  • Loading...

More Telugu News