: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం


జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ పట్టణంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. సోపోర్‌లోని అమర్‌గఢ్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఉగ్రవాదులను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఓ కానిస్టేబుల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News