: రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయిన వ్యక్తి.. రైలును ముందుకు తోసి రక్షించిన ప్రయాణికులు.. వైరల్ అయిన వీడియో.. మీరూ చూడండి!
ప్రమాదవశాత్తు రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న సందులో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తి కోసం మొత్తం ప్రయాణికులు దిగొచ్చారు. అందరూ కలిసి తలా ఒక చేయి వేసి రైలును ముందుకు తోసి మొత్తానికి అతడిని రక్షించారు. బీజింగ్‌లోని డోంగ్ఝిమెన్ స్టేషన్లో జరిగిందీ ఘటన. చిక్కుకుపోయిన ప్రయాణికుడి కోసం ప్రయణికులంతా ఏకమై రైలుపై చేయి వేసి... బలంగా ముందుకు నెట్టి విజయం సాధించారు. ఫ్లాట్‌ఫామ్ మధ్యలో చిక్కుకుపోయిన వ్యక్తిని రక్షించారు. గురువారం ఈ ఘటన జరగ్గా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. కారును తోసినట్టు రైలును నెట్టడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఓ వ్యక్తి కోసం వందలాది మంది ప్రయాణికులు చేసిన ప్రయత్నంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.