: ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన టెక్ దిగ్గజం 'డెల్'
తమ సంస్థలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం డెల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మారుతున్న టెక్నాలజీ పట్ల ఎవరికి వారే స్కిల్స్ ను పెంపొందించుకోవాలని... లేకపోతే కంపెనీ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉండాలని డెల్ సీఐఓ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాస్క్ స్పష్టం చేశారు. తమ సంస్థలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులంతా కంపెనీ రెవెన్యూను పెంచే దిశగా సన్నద్ధం కావాలని ఆయన తెలిపారు.
ఉద్యోగుల స్కిల్స్ ను ఏ ఆర్గనైజేషన్ పెంచలేదని... ఎందుకంటే ఉద్యోగులను ఎందులో ట్రైన్ చేయాలో కంపెనీలకు కూడా అవగాహన ఉండదని చెప్పారు. భవిష్యత్తు అవసరాలను ఉద్యోగులే అంచనా వేసుకోవాలని... దానికి తగ్గట్టుగా ఎవరికి వారు అప్ డేట్ కావాలని సూచించారు. కొత్త టెక్నాలజీలను ఉద్యోగులు అందిపుచ్చుకోవాలని అన్నారు.