: ఫ్రెండ్ షిప్ డే రోజు సర్ప్రైజ్ చేయనున్న హీరో రామ్!


‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్-లావణ్య త్రిపాఠి జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ క్రమంలో హీరో రామ్ ఓ ట్వీట్ చేశాడు. ‘సర్ప్రైజ్!!  ‘ఉన్నది ఒకటే జిందగీ’ లో స్నేహం గురించి తెలియజెప్పే ఓ సూపర్ కూల్ సాంగ్ ను ఈ ఆదివారం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా విడుదల చేయనున్నాం. డీఎస్పీ తన సంగీతంతో మళ్లీ కుమ్మేశాడు’ అని తన ట్వీట్ లో రామ్ పేర్కొన్నాడు.

కాగా, రామ్ ట్వీట్ పై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) స్పందిస్తూ..‘ప్రేమను కురిపించే ప్రతిఒక్క మిత్రుడికి ఈ పాట అంకితం కానుంది. పాటల రచయిత చంద్రబోస్ ఈ పాటను అద్భుతంగా రాశారు.. సో ఫ్రెండ్స్.. ఫ్రెండ్ షిప్ డేకు సిద్ధంగా కండి’ అని డీఎస్పీ అన్నారు.

  • Loading...

More Telugu News