: బోల్ట్! నేనెక్కడుంటానో తెలుసుకదా....క్రికెట్ ఆడాలనిపిస్తే వచ్చేయ్: కోహ్లీ ఆహ్వానం
జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కు క్రికెట్ అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. బోల్ట్ క్రికెట్ బాగా ఆడుతాడు కూడా. ఈ నేపథ్యంలో రేపు ఉసేన్ బోల్ట్ తన చివరి రేస్ లో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బోల్ట్ కు శుభాకాంక్షలు చెప్పిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు.
"చివరి రేస్ అయితేనేం.. ట్రాక్ పై అయినా, బయట అయినా నువ్వు ఎప్పటికీ ఫాస్టెస్ట్ మ్యాన్ వే. ఎప్పుడైనా క్రికెట్ ఆడాలనిపిస్తే వచ్చెయ్, నేను ఎక్కడుంటానో తెలుసు కదా" అని విరాట్ ఆహ్వానం పలికాడు. కాగా, ఉసేన్ బోల్ట్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ప్యూమా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లు అన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఉసేన్ బోల్ట్ ను పరుగుల యంత్రంగా పిలిస్తే, కోహ్లీని బ్యాటింగ్ యంత్రంగా పిలుస్తారు. ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.