: హార్డిక్ పాండ్య అవుట్...టీమిండియా 500/7
కొలంబో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తొలి రోజు సెంచరీలతో ఆకట్టుకున్న టీమిడియా బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా (133) అజింక్యా రహానే (132) నేడు అవుటయ్యారు. అనంతరం రవించంద్రన్ అశ్విన్, సాహా ఆకట్టుకున్నారు. అశ్విన్ అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, సహచరులు వెనుదిరుగుతున్నప్పటికీ సాహా నిలకడగా ఆడుతున్నాడు. అనంతరం ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్య (20) భారీ షాట్ కు యత్నించి మిడ్ ఆన్ లో మాధ్యూస్ కి దొరికిపోయాడు. దీంతో 135 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 500 పరుగులు చేసింది. క్రీజులో సాహా కు జతగా రవీంద్ర జడేజా ఆడుతున్నాడు.