: పవన్ కల్యాణ్ ప్రకటనపై బాధపడి... తమ్ముడికి సలహా ఇచ్చిన చిరంజీవి!
ఇప్పటికే జనసేన క్షేత్రస్థాయి సైనికుల ఎంపిక పూర్తైందని, మరో రెండు జిల్లాలు మిగిలి ఉన్నాయని ఆ తరువాత ప్రజల్లోకి వెళ్తానని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలు తగ్గిస్తానని, ఖాళీ రోజుల్లోనే సినిమాలు చేస్తానని, అవసరమైతే సినిమాలు మానేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఫీలయ్యారని తెలుస్తోంది.
రాజకీయాలు తాను కూడా చూశానని, అయితే రాజకీయాల్లో ఉండాలో? వద్దో? చెప్పను కానీ... సినిమాలు మాత్రం మానవద్దని సలహా ఇచ్చారట. ఎంత కష్టమైనా రెండింటిని బ్యాలెన్స్ చేసుకొమ్మని చెప్పారట. అంతే తప్ప సినిమాలు మానేస్తానని మాత్రం చెప్పవద్దని సూచించారని సమాచారం. తాను కూడా ఒకప్పుడు అలాగే ఆలోచించానని, ఇప్పుడు అది తప్పు అనిపిస్తోందని ఆయన తెలిపినట్టు తెలుస్తోంది.