: నన్ను క్వీన్ పక్కన సమాధి చేయవద్దు: 83 ఏళ్ల డెన్మార్క్ ప్రిన్స్ ప్రకటన
డెన్మార్క్ ప్రిన్స్ హెన్రిక్ సంచలన ప్రకటన చేశారు. తాను మరణించిన తరువాత తన సమాధిని తన భార్య క్వీన్ మార్ గ్రెతే పక్కన కట్టించవద్దని సూచించారు. తన భార్యను క్వీన్ గా సంభోదించి, తనను కింగ్ గా గుర్తించడం లేదని ఆయన వాపోయారు. భర్తగా తనకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు తమ సమాధులు పక్కపక్కనే ఉండాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. క్వీన్ ను ఆయన తొలిసారి ఇంగ్లండ్ లో కలిసారు. ఆ తరువాత ప్రేమలో పడ్డారు. 1967లో వివాహం చేసుకున్నారు.
మార్ గ్రెతే క్వీన్ అయిన సందర్భంలో తనను కింగ్ గా ప్రకటించాలని ఆయన కోరారు. దానికి ఆమె అంగీకరించలేదు. దీంతో అప్పటి నుంచి వారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. భార్యా భర్తలుగా ఒకే ప్యాలెస్ లో కలిసి జీవిస్తారన్న మాటే కానీ, ప్యాలెస్ లో అడుగుపెట్టిన అనంతరం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతారని, పెద్దగా మాట్లాడుకోరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన భార్య బతికి ఉండగానే ఆయన ఇలాంటి ప్రకటన చేయడం డెన్మార్క్ లో కలకలం రేపుతోంది.