: యువతిపై లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ సింగర్ యశ్ వదాలీ అరెస్ట్


ఓ యువతిపై లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ గాయకుడు యశ్ వదాలీని ముంబై ఓషివరా పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన వదాలీ, అక్కడికి వచ్చిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్యంగా తిడుతూ, కాలర్ పట్టుకుని లాగుతూ వేధించాడు. ఆ అమ్మాయి ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు, ఐపీసీ సెక్షన్లు 354, 504 కింద కేసు నమోదు చేసి వదాలీని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని నేడు దిండోషి సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టనున్నామని అన్నారు. కాగా, సదరు యువతి ఎవరో తనకు తెలియదని వదాలీ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News