: ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 344/3


శ్రీలంక-భారత్ మధ్య రెండో రోజు టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 344/3 గా ఉంది. క్రీజ్ లో పుజారా (128 నాటౌట్), రహానే (103 నాటౌట్) ఉన్నారు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. రాహుల్, పుజారా, రహానె రాణించడంతో భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ పటిష్ట స్థితిలో ఉంది. పుజారా-రహానె భాగస్వామ్యంలో 211 పరుగులు చేశారు. మరో విశేషమేమిటంటే.. 50వ టెస్టు ఆడుతున్న పుజారా నాలుగు వేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో, నాటి దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్ (4,947),  రాహుల్ ద్రవిడ్ (4,315),, సెహ్వాగ్ (4,103) తర్వాతి స్థానంలో పుజారా నిలిచాడు.

  • Loading...

More Telugu News