: గాంధీ ఆసుపత్రి అధికారుల అమానుషం ! ఆటో రిక్షాలోనే మహిళ ప్రసవం!
పురిటి నొప్పులతో వచ్చిన ఓ మహిళను ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించిన దారుణ సంఘటన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జరిగింది. ప్రసవవేదనలు పడుతున్న మహిళను చేర్చుకునేందుకు గాంధీ ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు నిరాకరించడంతో, అక్కడి పార్కింగ్ ప్లేస్ లో ఉన్న ఆటోలోకి ఆమెను వారి కుటుంబసభ్యులు చేర్చారు. ఎటువంటి వైద్య సాయం అందకుండానే ఆ మహిళ పండంటి మగబిడ్డను ప్రసవించింది. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.