: అసిస్టెంట్ ను కొట్టిన బాలకృష్ణ!
ఎప్పుడూ చాలా కూల్ గా ఉండే హీరో నందమూరి బాలకృష్ణ సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా, తన అసిస్టెంట్ తలపై ఒకటి పీకారు. షాట్ కోసం రెడీ అవుతున్న సమయంలో, తన షూ విప్పమంటూ తలపై ఓ దెబ్బ వేశారు. కేయస్ రవికుమార్ తో మాట్లడుతుండగా అసిస్టెంట్ బాలయ్య షూ విప్పాడు. 'పైపా వసూల్' సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే... తన 102వ చిత్రాన్ని కేయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య ప్రారంభించారు.