: మలుపులు తిరుగుతున్న నంద్యాల రాజకీయం.. డైలమాలో శిల్పా చక్రపాణిరెడ్డి


నంద్యాల రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ఉప ఎన్నికలో వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి, వైసీపీలో చేరాలని ఆ పార్టీ అధినేత జగన్ కండిషన్ పెట్టారు.

దీంతో, చక్రపాణిరెడ్డి డైలమాలో పడ్డారు. ఈ నేపథ్యంలో, ఆయన వైసీపీలో చేరే విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడినట్టు సమాచారం. వైసీపీలో చేరే అంశంలో చక్రపాణిరెడ్డి పునరాలోచనలో పడ్డారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలనే విషయాన్ని తనకు ముందు చెప్పలేదని ఆయన వాపోతున్నారు. మరి, ఆయన వైసీపీలో చేరుతారా? లేదా? అనే విషయం కాసేపట్లో తేలిపోనుంది. కాసేపట్లో నంద్యాలలో జగన్ బహిరంగసభ ప్రారంభంకానుంది.  

  • Loading...

More Telugu News