ayushman khurana: ఇదేం సినిమా అంటారేమో?


బాలీవుడ్లో కథలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీలైతే టైటిల్ తో .. లేదంటే ఎంచుకున్న లైన్ తోనే అంతా ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. అలా ఇప్పుడు బాలీవుడ్ జనాలు 'శుభ్ మంగళ్ సావధాన్' సినిమా గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. తమిళ దర్శకుడు ప్రసన్న .. అయుష్మాన్ ఖురానా - భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలుగా  హిందీలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 ఈ సినిమాలో హీరో .. హీరోయిన్ ప్రేమించుకుంటారు. ఇద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం జరుపుతారు. ఆ తరువాత హీరోకి అంగస్తంభన సమస్య ఉందనే విషయం హీరోయిన్ కి తెలుస్తుంది. అయినా ఆయన్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుందట. బాలీవుడ్లో ఇలాంటి ప్రయత్నాలు సహజమే అయినా, టాలీవుడ్ .. కోలీవుడ్ జనాలు మాత్రం .. "ఓరి దేవుడా.. ఇదేం సినిమా"? అంటారేమో!

ayushman khurana
bhumi
  • Loading...

More Telugu News