: నంద్యాలకు బయల్దేరిన వైసీపీ అధినేత.. జగన్ పర్యటనను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయన్న భూమన!
వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ నుంచి నంద్యాల బయల్దేరి వెళ్లారు. ఈ మధ్నాహ్నం మూడు గంటలకు నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరనున్నారు.
మరోవైపు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, వందలకొద్దీ హామీలను గుప్పించి, ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ఈ సభలో ఎండగడతామని చెప్పారు. ఈ ఉప ఎన్నికలో చంద్రబాబుకు నంద్యాల ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి టీడీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. జగన్ ను చూసి టీడీపీ వణుకుతోందని... నంద్యాలలో 11 మంది మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలు తిష్ట వేయడమే దీనికి నిదర్శనమని చెప్పారు.