: బురఖాలు వేసుకున్న యువతులా? బస్సులో సీట్లా? ఫోటో చూసి చెప్పండి!


పైనున్న ఫోటోను కాస్త చూడండి. 'వాట్‌ డూ పీపుల్‌ థింక్‌ ఆఫ్‌ దిస్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో వైరల్‌ అవుతోందీ ఫోటో... ఒక్క క్షణం చూస్తే, బురఖాలు ధరించిన అమ్మాయిలు వరుసగా కూర్చున్నట్టు కనిపించే భ్రమను కలిగిస్తున్న ఈ చిత్రంలో ఉన్నది బస్సులో సీట్లు. తొలిసారి చూసినప్పుడు కాస్తంత కన్ ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తున్న ఈ చిత్రాన్ని తొలుత నార్వేకు చెందిన 'యాంటీ ఇమిగ్రెంట్స్' పోస్టు చేసింది. ఆపై ఇది వేలసార్లు షేర్ కాగా, తొలిసారి చూస్తే, తమకూ బురఖాలు ధరించిన అమ్మాయిలే కనిపిస్తున్నారని పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరి మీకేం అనిపిస్తోంది?

  • Loading...

More Telugu News