: ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణల మధ్య శత్రుత్వం ఉండేది: గిరిబాబు


అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణల మధ్య శత్రుత్వం ఉండేదని సీనియర్ నటుడు గిరిబాబు అన్నారు. ఇదంతా వారి అభిమానుల వల్ల ఏర్పడిందేనని చెప్పారు. వ్యక్తిగతంగా కూడా కొన్ని విభేదాలు వీరి మధ్య ఉండేవని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాదుకు తీసుకువచ్చే అంశంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పారు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో, వీరిద్దరూ తమ మధ్య తలెత్తిన విభేదాలను పక్కన పెట్టేశారని తెలిపారు. కాల క్రమంలో ఎన్టీఆర్, కృష్ణ కూడా మంచి స్నేహితులుగా మారిపోయారని చెప్పారు. రాజకీయాల్లో, సినిమా రంగంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని తెలిపారు.
 

  • Loading...

More Telugu News