: మహా నటుడు దిలీప్ కుమార్ కు తీవ్ర అస్వస్థత
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, నిన్న ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. దిలీప్ కుమార్ డీహైడ్రేషన్ కు గురయ్యారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కాగా, గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నట్టు ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ ఉదయ తారా నాయర్ వెల్లడించారు. ఇంతకు ముందు కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన శ్వాసకోశ సంబంధిత రుగ్మతలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దిలీప్ కుమార్ ప్రస్తుత వయసు 94 సంవత్సరాలు. 1998లో చిట్టచివరగా 'ఖిలా' అనే సినిమాలో నటించారు.