: బీహార్‌లో రైలు హైజాక్.. మావోయిస్టులు, పోలీసులు మధ్య కొనసాగుతున్న కాల్పులు!
బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు ఓ రైలును హైజాక్ చేశారు. అనంతరం ఆ ప్రాంతంలోని మొబైల్ టవర్‌ను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకైతే రెండు వైపుల నుంచి ఎటువంటి ప్రాణ నష్టం లేదు. దానాపూర్ దుర్గ్ ఎక్స్‌ప్రెస్ రైలు (13288) భలుయి స్టేషనల్ వద్ద గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో హైజాక్ అయినట్టు సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. అలాగే కేబిన్ మ్యాన్‌ను అపహరించినట్టు పేర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.