: 2017 జూన్ వరకు 596 వెబ్సైట్లను బ్లాక్ చేసిన ప్రభుత్వం!
2017 జూన్ వరకు దేశ యువతను తప్పు దారి పట్టిస్తున్న 596 వెబ్సైట్లను, 735 సోషల్ మీడియా లింక్‌లను బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిలో దేశ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తున్న వెబ్సైట్లు, లింకులు కూడా ఉన్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి పీపీ చౌదరి తెలిపారు. లోక్‌సభకు లిఖిత పూర్వకంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వివిధ కోర్టుల ఆదేశం మేరకు, నిపుణుల సలహాల మేరకు ఈ వెబ్సైట్లను బ్లాక్ చేశామని మంత్రి తెలియజేశారు.
సాంకేతికతకు అవధులు లేకపోవడం వల్ల చాలా మంది అనైతిక కార్యకలాపాలకు పాటుపడుతున్నారని, వారందరి మీద ప్రభుత్వం నిఘా ఉంచిందని ఆయన చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంత ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి ప్రధాన్ మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఇందుకోసం రూ. 2,351.38 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలియజేశారు.