: `నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా` విడుద‌ల తేదీ ఖ‌రారు


అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న `నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా` సినిమా విడుద‌ల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 27, 2018న ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది. ఇందులో అల్లు అర్జున్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగా క‌నిపించేందుకు అమెరికా నుంచి వ‌చ్చిన ట్రైన‌ర్ల స‌మ‌క్షంలో ఫిట్‌నెస్ శిక్ష‌ణ పొందుతున్నాడు. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న అను ఎమ్మాన్యుయేల్ న‌టిస్తోంది. బాలీవుడ్ సంగీత ద్వ‌యం విశాల్ - శేఖ‌ర్‌లు ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు.

  • Loading...

More Telugu News