: వైసీపీ గెలిస్తే అభివృద్ధి ఎందుకు ఆగుతుంది?: అంబటి రాంబాబు


నంద్యాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'మాయాబజార్' సినిమా చూపిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఉప ఎన్నికలో టీడీపీని గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుందంటూ ఓటర్లను ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. నంద్యాలలో వైసీపీ గెలిస్తే అభివృద్ధి ఎందుకు ఆగిపోతుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఏమైనా తన ఇంట్లో ఉండే డబ్బు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారా? అని మండిపడ్డారు. నంద్యాల ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు.

ఈ ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోవడం ఖాయమని.. రానున్న రోజుల్లో ఆ పార్టీ ప్రతిష్ట మరింత దిగజారడం ఖాయమని చెప్పారు. నంద్యాలలో రేపు జరిగే బహిరంగసభలో తమ అధినేత జగన్ పాల్గొంటారని తెలిపారు. జగన్ సమక్షంలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరుతారని చెప్పారు.

  • Loading...

More Telugu News