: జ‌లాంత‌ర కెమెరాపై దాడి చేసిన సొర‌చేప‌... వీడియో చూడండి


స‌ముద్రంలో నివ‌సిస్తున్న జీవుల అధ్య‌య‌నం కోసం ఏర్పాటు చేసిన జ‌లాంత‌ర కెమెరా (అండర్ వాటర్ కెమెరా)పై ఓ సొర‌చేప దాడి చేసిన వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్లో వైర‌ల్‌గా మారింది. మ‌సాచుసెట్స్ డివిజ‌న్ ఆఫ్ మెరైన్ ఫిష‌రీస్ శాస్త్ర‌వేత్త గ్రెగ్ స్కోమ‌ల్ తెల్ల సొర‌చేపల మీద అధ్య‌య‌నం చేస్తుంటారు. ఇందులో భాగంగా ఆయ‌న స‌ముద్రంలో ఉంచిన కెమెరాపై వైట్ షార్క్ దాడి చేసింది. ఈ వీడియోలో కెమెరాను ఏదో జంతువు అనుకుని దూరం నుంచి దూసుకొచ్చిన ప‌న్నెండ‌డుగుల షార్క్ త‌న ప‌దునైన ప‌ళ్ల‌తో దాడి చేసిన దృశ్యం చూడొచ్చు. ఈ దాడిలో కెమెరాకు ఏం కాలేద‌ని గ్రెగ్ చ‌మ‌త్కరించారు.

  • Loading...

More Telugu News