: రామానాయుడు స్టూడియోకి విదేశీ పార్శిల్ ! .. ఎక్సైజ్ శాఖ ఆరా.. వివరణ ఇచ్చిన నిర్మాత సురేష్ బాబు!
డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిఘా మరింతగా పెంచింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న పార్శిళ్లపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలో హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియోకు విదేశాల నుంచి వచ్చిన పార్శిల్ ను ఎక్సైజ్ పోలీసులు పరిశీలించారు. ఈ విషయమై ఆరా తీసేందుకు ఎక్సైజ్ సీఐ కనకదుర్గ అక్కడికి వెళ్లారు. కాగా, ఈ విషయమై ప్రముఖ నటుడు రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, విదేశాల నుంచి వెన్నునొప్పికి సంబంధించిన పరికరాన్నిపార్శిల్ ద్వారా రానా తెప్పించుకున్నాడని చెప్పారు. దీనిని పరిశీలించేందుకు ఎక్సైజ్ పోలీసులు తమ స్టూడియోకు వచ్చారని చెప్పారు.