: శిల్పా మోహన్ రెడ్డిని చొక్కా పట్టుకుని నిలదీయండి: అఖిలప్రియ


నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డిపై మంత్రి భూమా అఖిలప్రియ నిప్పులు చెరిగారు. ఓట్లు అడగడానికి మోహన్ రెడ్డి వస్తే... ఆయనను చొక్కా పట్టుకుని నిలదీయాలని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నంద్యాలకు ఇప్పటి వరకు ఏం చేశావని ప్రశ్నించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. శిల్పా మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని ఆమె అన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్లాలో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. భూమా నాగిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించిన చరిత్ర శిల్పా మోహన్ రెడ్డిది అని అన్నారు. 

  • Loading...

More Telugu News