: 14 ఏళ్ల వయసులోనే తొలిముద్దు అనుభవం: రానాకు చెప్పిన రేష్మి
తన జీవితంలో 14వ ఏటనే తొలి ముద్దును రుచి చూశానని హాట్ యాంకర్, నటి రేష్మి సంచలన విషయాన్ని వెల్లడించింది. హీరో రానా హోస్ట్ చేస్తున్న ఓ టీవీ షోలో గెస్టుగా పాల్గొన్న రేష్మి, రానా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని చెప్పింది. అయితే, ఎవరుఈ ముద్దు పెట్టారన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. ఈ కార్యక్రమం చూసిన వారిలో కొందరు రేష్మి చిలిపి వేషాలు చిన్నతనం నుంచే మొదలయ్యాయని అంటుంటే, ధైర్యంగా తన అనుభవాన్ని చెప్పి మరోసారి తన డేరింగ్ నెస్ ను బయట పెట్టిందని మరికొందరు అభినందిస్తున్నారు.