: సన్నీ లియోన్ ప్రకటనపై గోవా అసెంబ్లీలో రసాభాస!
ప్రభుత్వ రవాణా వాహనాల్లో సన్నీ లియోన్ ప్రకటనకు సంబంధించిన పోస్టర్లు ఉండటంపై గోవా అసెంబ్లీలో దుమారం చెలరేగింది. గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న `కదంబ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కార్ప్` బస్సుల్లో సన్నీ లియోన్ నటించిన కండోమ్ ప్రకటన పోస్టర్‌లు ఉన్నాయి. మహిళలు, పిల్లలు ప్రయాణించే ఈ బస్సుల్లో ఇలాంటి ప్రకటనలు ఉండటంపై గోవా అసెంబ్లీ భగ్గుమంది. ఈ ప్రకటనల వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్‌టీ ఆడ్రూ ఫ్రాన్స్ సిల్వెయిరా అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలపై నిషేధం విధించాలని ఆయన సూచించారు. వీటి వల్ల గోవా ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ ఒరిగేదేం ఉండదని సిల్వెయిరా స్పీకర్‌తో అన్నారు.