: ముఖేష్ గౌడ్ మీద ఒత్తిడి ప్రయత్నమేమోనన్నది త్వరలోనే తెలుస్తుంది: దానం నాగేందర్
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పై ఒత్తిడి తెచ్చేందుకు విక్రమ్ గౌడ్ పై హత్యాయత్నం కేసును ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరిస్తున్నారన్న అనుమానాన్ని మాజీ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వాంగ్మూలమిచ్చిన సమయంలో విక్రమ్ గౌడ్ ఏం చెప్పాడో పోలీసులు ఎందుకు బయటపెట్టలేదని అడిగారు. ఆరు నెలల నుంచి తనపై కాల్పులు జరిపేందుకు స్కెచ్ గీశాడని చెబుతున్న పోలీసులు, ముందే ఎందుకు హెచ్చరించలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయపరమైన ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి ఘటనలు వాడుకుంటున్నారేమోనన్న అనుమానం రాకూడదని ఆయన సూచించారు. విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని, తమ అనుమానాలు తమకు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు అడ్డం పెట్టుకుని లొంగదీసుకుందామని ప్రయత్నిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదని ఆయన చెప్పారు.