: రేపిస్టులకు షాకిచ్చిన జోర్డాన్.. దశాబ్దాల చట్టానికి చెల్లుచీటి.. ఎగిరి గంతేస్తున్న మహిళా, మానవ హక్కుల సంఘాలు!


జోర్డాన్ పార్లమెంట్ చారిత్రక నిర్ణయం తీసుకుంది. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుంటున్న రేపిస్టులకు దిమ్మదిరిగే షాకిచ్చింది. జోర్డాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 308 ప్రకారం.. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బాధితురాలిని పెళ్లాడి, ఆమెతో మూడేళ్లు కాపురం చేస్తే కేసు నుంచి సులభంగా బయటపడిపోవచ్చు. ఇది రేపిస్టులకు వరంగా మారింది. ఈ చట్టంపై దశాబ్దాలుగా వివాదం చెలరేగుతూనే ఉంది. దీనిని నిషేధించాలని మహిళా, మానవహక్కుల సంఘాలు ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం మంగళవారం చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 308ను రద్దు చేసింది.

పార్లమెంటు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని ప్లకార్డులతో పార్లమెంటు బయట ఆత్రుతతో వేచి చూస్తున్న వేలాదిమంది పార్లమెంటు నిర్ణయం విని సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం జోర్డాన్‌కు చారిత్రక దినమని కొనియాడారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వేలాదిమంది కొనియాడారు. ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ప్రశంసల వర్షం కురిపించారు. ఇది రద్దు కావడానికి కారణమైన ప్రతి ఒక్కరినీ కొనియాడారు. మిగతా అరబ్ దేశాలు కూడా జోర్డాన్‌ను అనుసరించాలని కోరారు. గౌరవం గెలిచిందంటూ పలు రకాలుగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

  • Loading...

More Telugu News